ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బీఆర్‌ఎస్ నేతలపై కేసు
WGL: వర్ధన్నపేట పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి, సీఎం దిష్టి బొమ్మను దగ్దం చేసి కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో పాటు వారి అనుచరులు తుల కుమారస్వామి, యాకయ్య, మధు తదితరులపై శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.