డెంగీ కలవరం..15 రోజుల్లో 10 కేసుల

డెంగీ కలవరం..15 రోజుల్లో 10 కేసుల

KMM: ఖమ్మం జిల్లా కేంద్రంలో డెంగీ కేసులు పెరుగుతుండడంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఆందోళన మొదలైంది. గత 15 రోజుల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాల్లో పది కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. డెంగీ జ్వరంతో ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడంతో కేసుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. ఈనెల 7న ఒకేరోజు ఐదు కేసులు నమోదు కావడం గమనార్హం.