టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పి. గన్నవరం నియోజకవర్గ TDP కార్యాలయం వద్ద ఇవాళ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీ పార్టీదేనన్నారు. మహిళా లోకానికి ఎన్టీఆర్ వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు.