ఈనెల 18న గంధ మహోత్సవం

NLR: ఏఎస్‌పేటలోని హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వామి గంధ మహోత్సవం ఈనెల 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆత్మకూరు ఆర్డీవో పావని గంధమహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.