'కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోంది'

NLR: IAS అధికారులపై రాష్ట్రంలో కూటమిప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని MLC, YCP నెల్లూరు నగర ఇంఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్ అంటూ సీనియర్ IAS అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అక్రమంగా అరెస్టుచేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని అన్నారు.