VIDEO: ప్రైవేట్ పాఠశాల వాహనాలు తనిఖీ
NLR: అనంతసాగరం మండలంలోని ప్రైవేట్ పాఠశాల వాహనాలను ఆత్మకూరు మోటారు వెహికల్ ఇన్స్‌పెక్టర్ రాములు గురువారం తనిఖీ చేశారు. వాహనాల ఫిట్నెస్ పరిశీలించి, అవసరమైన భద్రతా పరికరాలపై యజమానులకు పలు సూచనలు చేశారు. ఎమర్జెన్సీ డోర్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు.