ఉంతకల్లులో పర్యటించిన ఆస్ట్రేలియా బృందం
ATP: బొమ్మనహాల్ మండలం ఉంతకల్లు గ్రామంలో సోమవారం సాయంత్రం ఆస్ట్రేలియా బృందం పర్యటించింది. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. గ్రామంలోని ఉచిత మంచినీటి పథకం విషయమై గ్రామ పెద్దలతో చర్చించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.