'వృత్తి ధర్మాన్ని బట్టి గుర్తింపు వస్తుంది'

'వృత్తి ధర్మాన్ని బట్టి గుర్తింపు వస్తుంది'

WGL: వృత్తి ధర్మంలో పని విధానాన్ని బట్టే సమాజంలో గుర్తింపు లభిస్తుందని నర్సంపేట ఎంఈవో సారయ్య అన్నారు. నర్సంపేట మండలంలోని భాంజిపేట ఉన్నత పాఠశాలలో సాంఘీకశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేసిన వెంకటేశ్వరప్రసాద్ పదవీ విరమణ సన్మాన సభను బుధవారం నిర్వహించారు. ఉద్యోగంలో వృత్తి నిబద్ధతతో పాటు సామాజిక సేవలో పాల్గొన్నారు. హెచ్ఎం వెంకట్రామ నరసయ్య, తదితరులున్నారు.