ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

TG: బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కటకటాల వెనక్కి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.