VIDEO: నిర్మల్‌లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

VIDEO: నిర్మల్‌లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

NRML: వైద్యులు డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని నిర్మల్ పట్టణంలో బీజేపీ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేస్తుండగా, మరో వర్గం వారు అడ్డుకుని తెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఇరు పక్షలను చెదరగొట్టారు.