ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి: ఈటల

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి: ఈటల

TG: హనుమకొండలో వరద ముంపు ప్రాంతాలను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. వివేక్‌నగర్, సమ్మయ్యనగర్, 100 ఫిట్ రోడ్ ప్రాంతాలకు ఆయన వెళ్లారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే వరంగల్, హనుమకొండలో ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ముందస్తు వరద నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.