VIDEO: సముద్రంలోకి కొట్టుకుపోయిన బోటులు

SKLM: మందస మండలంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు,వాగులు,వంకలు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలో దున్నూరు పంచాయతీ గెడ్డూరు గ్రామంలో సముద్రపు ఒడ్డున వరదనీరు కలిసే మార్గంలో ఉన్న ఒక ఇంజన్ బోట్,తెప్ప బోటులు వరద ప్రభావానికి కొట్టుకుపోయాయి. మత్స్యకారులు గమనించి శ్రమించి బోట్లను సురక్షితంగా ఉంచడంతో ఆస్తి నష్టం తప్పింది.