పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సమకూర్చుకోవాలి: ఐటీడీఏ పీవో
BDK: ములకలపల్లి జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో రాహుల్ పర్యవేక్షించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విధులకు హాజరైన సిబ్బందికి గానీ, ఓటు వినియోగించుకునే ఓటర్లకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.