మళ్లీ రప్పా రప్పా పోస్టర్లు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ రోడ్ షోలో రప్పా రప్పా 2028 పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. అందులో బీఆర్ఎస్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు ఉన్నాయి. కాగా గతంలో వైసీపీ సభలో ఇలాంటి పోస్టర్లనే ప్రదర్శించడంతో తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.