కందుకూరి పురస్కార ప్రధానోత్సవం.. హాజరైన మంత్రి

విజయవాడలో కందుకూరి రాష్ట్ర, జిల్లా స్థాయి రంగస్థల పురస్కారాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుర్గేశ్, సినీరచయిత సాయిమాధవ్ హాజరయ్యారు. నాటకరంగంలో సేవలందించిన వారికి అవార్డులు ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి, జిల్లా స్థాయిలో 107 మందికి పురస్కారాలు అందించారు. రాష్ట్రస్థాయి గ్రహీతలకు రూ.లక్ష, జిల్లాస్థాయి వారికి రూ.10 వేల చొప్పున బహుమతి ప్రదానం చేశారు.