'ఆన్‌లైన్ సదుపాయం వినియోగించుకోవాలి'
MDK: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్‌లైన్ సదుపాయం వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ సూచించారు. టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా పోరం సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన పోర్టల్‌ను జిల్లా కార్యదర్శి రాజకుమార్‌తో కలిసి ప్రారంభించారు.