శాగాపూర్‌లో కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

శాగాపూర్‌లో కరెంట్ షాక్‌తో ఎద్దు మృతి

WNP: పానగల్ మండలం శాగాపూర్ గ్రామంలో ఇవాళ సాయంత్రం రైతు మైబుస్‌కు చెందిన ఎద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఎద్దు విలువ రూ. 80 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ బాలరాజు యాదవ్ ఘటన స్థలానికి చేరుకుని రైతును పరామర్శించారు. ప్రభుత్వ పరంగా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని రైతుకు భరోసా ఇచ్చారు.