రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

WGL: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన దేవరుప్పులలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జనగామ నుంచి తిరుమలగిరికి ఓ ట్రాలీ వెళ్తుండగా.. తిరుమలగిరి నుంచి జనగామ వైపు మరో వాహనం వస్తోంది. ఈ క్రమంలో చింతబావితండా వద్ద రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కామారెడ్డి గూడెంకు చెందిన మరిపెల్లి యాకన్న, తిరుమలగిరికి చెందిన సంపత్ అక్కడిక్కడే మృతి చెందారు.