VIDEO: పుంగనూరులో భక్తి శ్రద్ధలతో శివకోటి

CTR: పుంగనూరు రూరల్ ఉలవలదిన్నె గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం పలువురు భక్తి శ్రద్ధలతో శివకోటిని చేపట్టారు. గ్రామంలోని రామాలయం వద్ద ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శివపార్వతుల చిత్రపటాలను కొలువుదిర్చి పూజలు నిర్వహించారు. అనంతరం శివకోటిని ప్రారంభించారు. నిర్విరామంగా 24 గంటల పాటు శివకోటి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.