'నారీ శక్తి వందన్ సమ్మేళన్'ను వీక్షించిన మంత్రి
సత్యసాయి: మహిళలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న 'నారీ శక్తి వందన్ సమ్మేళన్'ను మంత్రి సత్యకుమార్ యాదవ్ బత్తలపల్లిలో వర్చువల్‌గా వీక్షించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. కుటుంబాన్ని నడిపించే మహిళ సమాజాన్ని కూడా ప్రగతి పథంలో నడిపించగలదని తెలిపారు.