భవిత కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవిత కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు భవిత సెంటర్‌కు రెగ్యులర్‌గా హాజరు కావాలని, వారి సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.