దుబ్బతండా సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం
SDPT: అక్కన్నపేట మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. తండా అభివృద్ధికి కృషి చేసిన గుగులోతు శీలా రాజలింగం నాయకుని తండావాసులు గురువారం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మారుమూల తండాలో ఏకగ్రీవం సాధించడంపై పలువురు ప్రశంసలు తెలిపారు. సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులను కూడా తండావాసులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.