'చేయూత పెన్షన్ దారుల మహా గర్జనను జయప్రదం చేయండి'

SRPT: సెప్టెంబర్ 3 హైదరాబాద్‌లో జరిగే చేయూత పెన్షన్ దారుల మహా గర్జనను జయప్రదం చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కోరారు. సోమవారం తుంగతుర్తిలో జరిగిన సన్నాహక సదస్సులో పాల్గొని మాట్లాడారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన వికలాంగుల మరియు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని అమలు చేయాలన్నారు.