భారీ వర్షాలు.. రైతుల్లో ఆందోళన

భారీ వర్షాలు.. రైతుల్లో ఆందోళన

E.G: కె.గంగవరం మండలంలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి దాళ్వా వరి పంట ఒబ్బిడి చేసుకుంటున్న వరి రైతులు ఆందోళనకు గురయ్యారు. అకాల వర్షం వల్ల కళ్లాలలో ఉంచిన ధాన్యం తడిచి ముద్దయింది. దీని వలన ధాన్యం రంగు మారి మొలకలు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా కోత కోయలేదు. వర్షానికి చేలు ఒక పక్కకు వాలిపోయాయి.