ఆదోని జిల్లా ఏర్పాటుకు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే సంఘీభావం

ఆదోని జిల్లా ఏర్పాటుకు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే సంఘీభావం

కర్నూలు: ఆదోని జిల్లా సాధనకై బీమాస్ సర్కిల్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మంగళవారం మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటు ప్రజల హక్కేనని, ఐదు నియోజకవర్గాలకు సమీపంలో ఉండటం అభివృద్ధికి దోహదపడుతుందని బుట్టా రేణుక పేర్కొన్నారు. 20 రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.