దేవాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

దేవాలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ELR: ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. ఏలూరు నగరంలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు పవర్ పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారి దేవస్థానంలో ఒక అడుగు ఎత్తులో గ్రానైట్ వేసే పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.