కొల్లిపర గుండెపోటుతో వ్యక్తి మృతి
GNTR: కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి చెందిన మున్నంగి ప్రేమయ్య (50) ఆదివారం గుండెపోటుతో మరణించారు. సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.