రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కృష్ణా: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. యానం నుంచి బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పల్లంకూరు శివారు ఐచెరువుకు చెందిన బూల చింటూ (20) అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.