కొండా సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

WGL: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి X వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండే సురేఖ గారు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండి మరింత కాలం ప్రజలకు సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఆమె ప్రజల అంచనాలను నెరవేర్చుతూ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు.