బాలుడిపై పక్కింటి యువతి లైంగిక దాడి

బాలుడిపై పక్కింటి యువతి లైంగిక దాడి

HYD: బాలుడి(16)పై యువతి లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇంటి పక్కన ఉండే యువతి పలుమార్లు తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడి, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రుల దృష్టికి బాలుడు తీసుకురావడంతో ఈ ఘటన బయటకి వచ్చింది. బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.