బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు!
బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ యూనస్ ప్రకటించారు. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనాపై విచారణకు వ్యతిరేకంగా అవామీ లీగ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో వాహనాల దహనం, బాంబు దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో రాజధాని ఢాకాలో భద్రతా దళాలు మోహరించాయి.