గ్రీవెన్స్‌లో 12 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి హెల్త్ పింఛన్లు, రెవెన్యూ సమస్యలు, బస్ సర్వీసులు తదితర అంశాలపై 12 వినతి పత్రాలు స్వీకరించారు. వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.