రైతుల ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసిన దుండగులు
SKLM: రైతుల పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను చోరీ చేసిన సంఘటన మందస(M) కొత్త కమలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పలువురు రైతులకు ప్రభుత్వం అగ్రికల్చర్ విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గతంలో మంజూరు చేసింది. వాటిని గుర్తుతెలియని దుండగులు నిన్న రాత్రి ధ్వంసం చేసి, విలువైన రాగి వైరును దోచుకెళ్లారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.