'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'
MLG: ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు ముంజల బిక్షపతి గౌడ్ అన్నారు. ములుగులో ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్ కార్డులను ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.