భైంసాలో ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధం

భైంసాలో ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధం

ADB: ప్రమాదవశాత్తు స్కూటీ దగ్ధం అయిన ఘటన బుధవారం భైంసాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కడెంకు చెందిన రమేశ్ స్కూటీపై పని నిమిత్తం భైంసాకు వస్తుండగా పట్టణంలోని గణేశ్ ఇండస్ట్రీ వద్ద స్కూటీ లోంచి మంటలు చెలరేగాయి. బండిని పక్కకు ఆపి దిగి చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.