చేజర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు దుర్మరణం

చేజర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు దుర్మరణం

NLR: చేజర్ల మండలం కాకివాయి రోడ్డులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి కలువాయి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు దాటుతున్న వృద్ధురాలు అంకమ్మను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.