ఆలయంలో హుండీ పగలగొట్టిన దుండగులు

ఆలయంలో హుండీ పగలగొట్టిన దుండగులు

ప్రకాశం: సింగరాయకొండ కోదండ రామస్వామి ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీ పగలగొట్టి అందులోని నగదు దోచుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకుడు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.