పిచ్చికుక్క స్వైర విహారం
SRPT: సూర్యాపేటలో నెహ్రూ నగర్ ప్రాంతంలో ఆదివారం పిచ్చికుక్క ఐదుగురిపై దాడి చేసింది. ఆర్‌వీ హాస్పిటల్ వద్ద నలుగురు వ్యక్తులను, పాత బండల బజార్‌కు చెందిన వెంకటమ్మ అనే మహిళను ఆమె ఇంటి ముందురోడ్డుపై కూర్చుని ఉన్న సమయంలో గాయపరిచింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.