ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడి మృతి

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడి మృతి

VZM: మెంటాడ (M) గుర్ల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గజపతినగరం నుంచి కోటపర్తివలసకు సిమెంట్ ఇటుకలు ట్రాక్టర్ పై తీసుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు గణేశ్(18) విశాఖ జిల్లా అనంతగిరి(M) మూలవలస వాసిగా సమాచారం. ఈ ఘటనపై పొలీసులు కేసునమోదు చేసారు.