సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: చిరాగ్‌పల్లి పోలీసులు

SRD: మొగుడంపల్లి మండలం ఇప్పేపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు సైబర్ నేరాలపై చిరాగ్‌పల్లి పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకించి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వేదికల ద్వార అనుమానస్పద లింకులను క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు.