పసుపల గ్రామంలో బండలాగుడు పోటీలు

పసుపల గ్రామంలో బండలాగుడు పోటీలు

NDL: బనగానపల్లె మండలం పసుపుల గ్రామంలో బండలాగుడు పోటీలను గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ నెల 6 నుంచి 10 వరకు సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా చేస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బండలాగుడు పోటీలను ఘనంగా ప్రారంభించారు.