శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం: ఎస్పీ

శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం: ఎస్పీ

అన్నమయ్య: శాంతియుతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం అని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.