108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

NLG: కట్టంగూర్ మండలంలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అటిపాములకు చెందిన గర్భిణీ స్పందనకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కి ఫోన్ చేశారు. వెంటనే గర్భిణీని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే స్పందన ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చింది.