VIDEO: వృధాగా పోతున్న తాగునీరు

VIDEO: వృధాగా పోతున్న తాగునీరు

కోనసీమ: అమలాపురం మండలం ఈదరపల్లిలోని రహదారి పక్కన ఉన్న తాగునీరు పైపు లైన్ పగిలి పోవడంతో తాగునీరు వృధాగా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివలన తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైను మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.