VIDEO: ముమ్మరంగా ఫిల్టర్ బెడ్స్ శుభ్రపరిచే పనులు
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీలోని ఫిల్టర్ బెడ్స్‌ను ఈరోజు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యం ప్రాధాన్యతగా భావిస్తూ, నీటి వనరులు శుభ్రంగా ఉండేందుకు క్రమం తప్పకుండా ఫిల్టర్ బెడ్స్ శుభ్రపరిచే పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.