కబడ్డీ ఛాంపియన్‌కు ఘన సత్కారం

SKLM: బీహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఈనెల 4 నుండి 8వ తేదీ వరకు 7వ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన ఆమదాలవలస మండలం అక్కులపేట గ్రామానికి చెందిన క్రీడాకారుడు సత్తారు రామ్మోహన్‌ను బుధవారం గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ పోటీలలో మన రాష్ట్రం కాంస్య పతకం సాధించింది.