ఎలక్షన్ గోదాములను పరిశీలించిన డీఆర్, ఆర్డీవో

నెల్లూరు: ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్షన్ గోదామును డీఆర్ఆ హుస్సేన్ సాహెబ్, నెల్లూరు ఆర్డీవో అనూష మంగళవారం పరిశీలించారు. వారు గోదాములోని ఎలక్షన్ మెటీరియల్ భద్రత, రక్షణ చర్యలు, నిర్వహణ విధానాలు గురించి సమగ్రంగా తనిఖీ చేశారు. అవసరమైన మరమ్మతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను ఆదేశించారు. అవసరమైన భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.