నాలుగు గోల్డ్ మెడల్స్ గెలిచిన 94 ఏళ్ల బామ్మ
చెన్నైలో జరిగిన ఏసియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 94 ఏళ్ల బామ్మ ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్ సాధించారు. రాజస్థాన్‌కు చెందిన పానీదేవి గోదార.. షార్ట్‌పుట్, డిస్కస్, జావెలిన్ త్రో, ఆటల్లో పతకాలు గెలుచుకున్నారు. 100 మీటర్ల పరుగు పందెంలో కూడా విజయం సాధించారు. గోల్డెన్ గ్రాండ్ మదర్‌గా పిలుచుకునే ఆమె.. ఇప్పటివరకు 16 పతకాలు సాధించినట్లు చెప్పారు.