కత్తులతో దాడి.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

కత్తులతో దాడి.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

NLR: నెల్లూరులో హత్య కేసు నిందితులపై శనివారం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. నిందితుడు కానిస్టేబుల్‌పై కత్తితో చేతి మీద దాడి చేశాడు. దీంతో పోలీసులు జేమ్స్ కాలిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం వీరు నెల్లూరు GGHలో చికిత్స పొందుతున్నారు. నిందితులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టగా ఈ ఘటన చోటు చేసుకుందని రూరల్ DSP శ్రీనివాస్ తెలిపారు.