ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం
ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అమెరికా ప్రభుత్వం ఇటీవల 30 లక్షలకు పైగా దస్త్రాలను విడుదల చేసింది. అయితే, మరో 47 వేల ఫైళ్లను పరిశీలన పేరుతో తాత్కాలికంగా నిలిపివేసింది. బాధితుల ప్రైవసీ, అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాక వీటిని విడుదల చేస్తామని తెలిపింది. వీటిలో ప్రపంచ స్థాయి రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.